యువత పోటీ పరీక్షల్లో విజయం సాధించే వరకు ఉచిత శిక్షణ,గ్రాండ్ టెస్టుల కొనసాగింపు

ముఖ్యమైన పాయింట్స్:గ్రాండ్ టెస్ట్‌కు 713 మంది అభ్యర్థుల హాజరు:మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్........తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...... మంచిర్యాల జిల్లా.... మంచిర్యాల జిల్లా యంత్రాంగం,జిల్లా కలెక్టర్ మరియు రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కానిస్టేబుల్, ఎస్‌ఐ ఉద్యోగాలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ పోలీస్ శాఖ మరియు మంచిర్యాల జిల్లా యంత్రాంగం సంయుక్తంగా ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. యువతకు ఆర్థిక ఇబ్బందులు ఎదురుకాకుండా సుమారు 500 మంది అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యాలను కల్పిస్తూ హైదరాబాద్‌కు చెందిన నిపుణులైన ఫ్యాకల్టీ ద్వారా ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అభ్యర్థుల సామర్థ్యాన్ని...