సబ్ జూనియర్ బాలుర అండర్ 16 ఇయర్స్ సెలక్షన్స్

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 1 : నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండల కేంద్రం 'భూదేవి ఇండోర్ స్టేడియం'లో ఈ నెల 5వ తేదీ గురువారం రోజున సెలక్షన్స్ నిర్వహిస్తామని నిజామాబాద్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.లింగయ్య కె.గంగాధర్ రెడ్డిలు ఆదివారం రోజు ఒక ప్రకటనలో తెలిపారు.ఆసక్తి గల క్రీడాకారులు గురువారం రోజు ఉదయం 10 గంటల లోపు రిపోర్ట్ చేయాలని కోరారు. క్రీడాకారుల బరువు 60 కేజీలకు మించకుండా ఉండాలనన్నారు. అదేవిధంగా డిసెంబర్ 13, 2010 తర్వాత జన్మించి వారై ఉండాలన్నారు. పాల్గొనే క్రీడాకారులు ఆధార్ కార్డు, పదోతరగతి మెమో వెంట తెచ్చుకోవాలని సూచించారు.. ఈ సెలక్షన్ ల్లో...