మద్దూరులో పోలీసుల మెరుపు దాడులు
144 ఇళ్ల తనిఖీ.. 79 వాహనాలు సీజ్.. 15.66 లీటర్ల మద్యం స్వాధీనం మద్దూరు: నేరాల నియంత్రణ, అక్రమ కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా పోలీసులు మద్దూరు పట్టణంలోని అమర్గడ్డ కాలనీలో ఆదివారం తెల్లవారుజామున విస్తృతంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ ఆదేశాల మేరకు కోస్గి సీఐ సైదులు ఆధ్వర్యంలో ఉదయం 5:30 నుంచి 8:30 గంటల వరకు ఈ తనిఖీలు చేపట్టారు. ఈ ఆపరేషన్లో 65 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తనిఖీల్లో భాగంగా కాలనీలోని 144 ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన ధ్రువపత్రాలు లేని, అనుమానాస్పదంగా ఉన్న 79 వాహనాలను సీజ్ చేశారు. వీటిలో...