చెట్టుకు ఉరివేసుకుని యువకుడి ఆత్మహత్య.
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 01,తెలంగాణ కెరటం:మతిస్థిమితం సరిగ్గా లేని యువకుడు చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన దుబ్బాక పట్టణ శివారులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. దుబ్బాక ఎస్సై కీర్తి రాజు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్ద చీకోడు గ్రామానికి చెందిన హలీమాబి అనే వృద్ధురాలు కూలి పని చేస్తూ, కుటుంబంతో జీవనం సాగిస్తోంది. గత నెల 14వ తేదీన రెండవ కుమారుడు ఎండి రఫీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీనితో ఆమె మూడవ కుమారుడు మతిస్థిమితం సరిగా లేని ఎండి ఫారుక్ (28) తీవ్రంగా బాధపడుతూ, అన్న మీద ప్రేమతో నేను కూడా అన్న వద్దకే పోతానంటూ అరిచేవాడు. ఆదివారం ఉదయం ఇంట్లో...