మోడీ, అమిత్ షాపై మంత్రి పొన్నం వ్యాఖ్యలు హాస్యాస్పదం

  ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యం  తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, తెలంగాణ అమరవీరుల త్యాగాలను అవహేళన చేసిన మోడీ, అమిత్ షా తెలంగాణ ప్రజలకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు దొంగే..దొంగ దొంగ అన్నట్లుగా ఉందని బిజెపి ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మర్రిపెల్లి సత్యమ్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడుతూ..1969 లో తెలంగాణ తొలి విడత ఉద్యమం ప్రారంభమైనప్పుడు 369 మంది ప్రాణ త్యాగం చేశారని, అప్పుడు కేంద్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్న విషయం మంత్రి పొన్నం తెలుసుకోవాలని అన్నారు. 09 డిసెంబర్ 2009 తేదీన...