నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ వేటు

 నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ వేటుతెలంగాణ కెరటం నాగర్‌కర్నూల్ నాగర్‌కర్నూల్ జిల్లాలో అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ కఠిన చర్యలు తీసుకున్నారు. ఉప్పునుంతల తహసీల్దార్ ఎ. సునీతను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాల ప్రకారం అచ్చంపేట డివిజన్ ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లిలో సర్వే నంబర్ 115కు సంబంధించిన భూ రికార్డుల్లో అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయి. 13 ఎకరాల 17 గుంటల భూమి ఇతరుల పేర్లపై అక్రమంగా నమోదైనట్లు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. అచ్చంపేట సబ్ కలెక్టర్ సలోని చాబ్రాను...