స్టేషన్‌కు వాస్తు దోషమా? రెండున్నరేళ్లలో ఏడుసార్లు ఎస్సైల మార్పు

సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మార్పుల పరంపర కొనసాగుతోంది. గంభీరావుపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌లో అధికారుల మార్పుల పరంపర కొనసాగుతోంది. స్టేషన్‌కు ఏమైంది..? ఇక్కడ విధులు నిర్వహించాలంటే అధికారులకు ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా..? లేక స్టేషన్‌కు వాస్తు దోషమేమైనా ఉందా..? అంటూ స్థానికుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. 2024 ఏప్రిల్ నుంచి 2026 అక్టోబర్ వరకు సుమారు రెండున్నరేళ్ల వ్యవధిలో ఆరుగురు ఎస్సైలు మారగా, ఏడుసార్లు బాధ్యతల మార్పు జరిగినట్లు అందుబాటులో ఉన్న వివరాలు చెబుతున్నాయి. వచ్చిన కొద్దిరోజులకే మార్పు!ఒక పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై కొంతకాలం కొనసాగితేనే స్థానిక పరిస్థితులు, గ్రామాల సమస్యలు, శాంతిభద్రతలు, పెండింగ్ కేసులపై పూర్తి అవగాహన ఏర్పడుతుంది. కానీ...