నీళ్లు, విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలి
పంటల సాగుపై రైతులకు అవగాహనతెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 2నారాయణపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డీపీఆర్ఓ) ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఉమ్మడి మద్దూరు మండల పరిధిలోని గోకుల్ నగర్ గ్రామంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించింది.ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడే అవకాశాల నేపథ్యంలో నీరు, విద్యుత్‌ను ప్రతి ఒక్కరూ పొదుపుగా వినియోగించుకోవాలని కళాకారులు సూచించారు. ముఖ్యంగా రైతులు నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకొని వరికి బదులుగా ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు.మాటలు, పాటల రూపంలో ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా నీటి సంరక్షణ, విద్యుత్ పొదుపు,...