రైతుల ధాన్యం కొనుగోళ్లలో జాప్యం సహించేది లేదు
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి బోనస్ బకాయిలను వెంటనే చెల్లించాలి కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించాలి అధికారులకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సూచనరైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అధికారులకు సూచించారు. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని స్పష్టం చేశారు.సదాశివపేట మండలం పెద్దాపూర్ రైతు వేదికలో నందికంది పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం సంగారెడ్డి మండలం...