కాచెరువు శిఖం భూమిని కాపాడాలి
ఆక్రమణలను అరికట్టి.. హద్దులు నిర్ణయించాలి ప్రజావాణిలో మత్స్య సహకార సంఘం సభ్యుల వినతి తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 2 మద్దూరు గ్రామ శివారులోని కాచెరువు శిఖం భూమిని సర్వే చేసి, హద్దులు నిర్ణయించి పరిరక్షించాలని మద్దూరు మత్స్య సహకార సంఘం సభ్యులు కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో భార్గవ్ రామ్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ.. మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని నిడ్జింత రోడ్డుకు సమీపంలో ఉన్న కాచెరువు పరిధిలో సర్వే నంబర్ లో సుమారు 60 ఎకరాల 10 గుంటల శిఖం భూమి ఉందని తెలిపారు. అయితే, ఈ భూమిలో కొంత భాగాన్ని కొందరు...