ఆటల్లో గెలుపోటములు సహజం.. క్రీడా స్ఫూర్తితోనే ముందుకు సాగాలి

70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు ఘనంగా ప్రారంబించిన  మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల  తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 2: నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండల పరిధిలోని బషీరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో ఏర్పాటు చేసిన 70వ అండర్-14, అండర్-17 (బాలబాలికల) మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలను సోమవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మార్చ్ ఫాస్ట్, సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించారు. మార్చ్ ఫాస్ట్ లో ఉత్తమ ప్రతిభ కనబరచిన పాఠశాలకు జ్ఞాపికలు అందజేశారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో...