రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు

రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటు విపక్షాలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు.... మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం కన్వెన్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ప్రకృతి కన్నెర్రతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. యాభై ఏళ్ల నుంచి సముద్రంలో భూతాపం పెరిగి ఎలినినో రూపంలో విలయతాండం చేస్తోందనే నిజాలు తెలియని విచిత్ర పరిస్థితిలో విపక్ష నేతలున్నారని విమర్శించారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టులోకి ఈ మధ్య కురిసిన అకాల వర్షాలతో వరదనీరు చేరిందన్నారు....