స్పైసెస్ ఇండస్ట్రీస్, రెస్టారెంట్ లపై టాస్క్ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారుల దాడులు
పాటించని నిర్వాహకులకు జరిమానాలు షో కాజ్ నోటీసులు జారీ.. తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 02 : కోరుట్ల మండలంలోని కిషన్ రావు పల్లె శివారులోని రోజ్, శ్రీ రాజరాజేశ్వర స్పైసెస్ ఇండస్ట్రీస్ లతో పాటు కోరుట్ల పట్టణంలోని విజయ్ ఫ్యామిలీ రెస్టారెంట్ లలో హైదరాబాద్ టాస్క్ఫోర్స్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారి అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార పదార్థాల నాణ్యత, వంటకాల తయారీలో పాటిస్తున్న పరిశుభ్రత, ఆహార పదార్థాల నిల్వ విధానం తదితర అంశాలను పరిశీలించారు. వినియోగదారులకు నాణ్యమైన, సురక్షితమైన ఆహారం అందించేందుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలు పాటించాలని సూచించారు....