విద్యుత్ తీగల రూపంలో యమపాశాలు.. 14 ఏళ్ల గిరిజన బాలుడి దుర్మరణం

విద్యుత్ తీగల రూపంలో యమపాశాలు.. 14 ఏళ్ల గిరిజన బాలుడి దుర్మరణం పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లి విద్యుదాఘాతానికి బలి గోవర్ధనపురంలో విషాదం.. నిరుపేద గిరిజన కుటుంబంలో తీరని శోకం రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద గిరిజన కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. చిన్న వయసులోనే కుటుంబానికి చేదోడువాదోడుగా ఉండేందుకు కూలీ పనులకు వెళ్లిన 14 ఏళ్ల బాలుడు విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయాడు. ఈ హృదయవిదారక ఘటన వరదయ్యపాలెం మండలం గోవర్ధనపురంలో సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..తిరుపతి జిల్లా, వరదయ్యపాలెం మండలం, గోవర్ధనపురం హైస్కూల్‌కు వెళ్లే మార్గంలో ఓ కళ్యాణమండపం వద్ద వివాహ వేడుకల సందర్భంగా రోడ్డుకు ఇరువైపులా అలంకరణ కోసం గుంజలు...