మిల్లర్లు, బియ్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలి
ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే బియ్యం విక్రయించాలి జిల్లా పౌరసరఫరాల అధికారి ఎస్.జితేందర్ రెడ్డి తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 02 జగిత్యాల జిల్లా పరిధిలోని రైస్ మిల్లులు, హోల్సేల్, రిటైల్ బియ్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని జగిత్యాల జిల్లా పౌరసరఫరాల అధికారి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మార్కెట్లో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా పౌరసరఫరాల శాఖ క్షేత్రస్థాయి యంత్రాంగం నిరంతరం తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. వ్యాపారులు పాటించవలసిన ముఖ్య నిబంధనలను తెలియజేశారు. మిల్లులు, గోదాములు, దుకాణాలలో అక్రమంగా బియ్యాన్ని నిల్వ ఉంచరాదని, ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే విక్రయించాలని...