మాధవ్ నగర్ ఆర్ఓబీకి రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతి
పెండింగ్లో ఉన్న అదనపు నిధుల మంజూరుకు నిరంతర పోరాటం ఫలించింది నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మంత్రులు భట్టి, కోమటిరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపిన అర్వింద్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 03 : నిజామాబాద్ ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మాధవ్ నగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిచ్పల్లి–నిజామాబాద్ రైల్వే స్టేషన్ల మధ్య లెవెల్ క్రాసింగ్ నంబర్ 193 వద్ద నాలుగు వరుసల ఆర్ఓబీ నిర్మాణానికి రూ.101.80 కోట్లతో సవరించిన పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ, నవంబర్ 02,న జీవో ఆర్టీ నెంబర్ 568 జారీ చేసింది. గతంలో రూ.93.12 కోట్లుగా ఉన్న...