ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేయాలి
ఉపాధ్యాయులు విద్యా ప్రమాణాల పెంపుదలకు కృషి చేయాలి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 3: విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తూ, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాలని బాల్కొండ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ పిలుపునిచ్చారు.నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ ఆధ్వర్యంలో బాల్కొండ, ముప్కాల్ మండలాలకు చెందిన ప్రాథమిక పాఠశాలలప్రధానోపాధ్యాయులఉపాధ్యాయులతో కాంప్లెక్స్ స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో విద్యార్థులకు మిడ్లైన్ పరీక్షలను ఆన్లైన్ విధానంలో ఏ విధంగా నిర్వహించాలి, డెమో యాప్ను ఎలా ఉపయోగించాలి అనే అంశాలపై...