17 ఏళ్లుగా పూర్తికాని రైల్వే బ్రిడ్జి పనులు.. ఘట్‌కేసర్ బంద్ విజయవంతం

*17 ఏళ్లుగా పూర్తికాని రైల్వే బ్రిడ్జి పనులు.. ఘట్‌కేసర్ బంద్ విజయవంతం* *అఖిలపక్షం ఆధ్వర్యంలో ఐక్యంగా నిరసన..*  *స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేసిన వ్యాపారులు* *– బ్రిడ్జి నిర్మాణ పనులు తక్షణమే పూర్తి చేయాలని నాయకుల డిమాండ్* (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 2 : ఘట్‌కేసర్ మండలంలో గత 17 సంవత్సరాలుగా రైల్వే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు నిరసనగా అఖిలపక్షం ఆధ్వర్యంలో సోమవారం ఘట్‌కేసర్ బంద్ నిర్వహించారు. ఏళ్ల తరబడి బ్రిడ్జి నిర్మాణం పెండింగ్‌లో ఉండటంతో ప్రజలు పడుతున్న అవస్థలను ప్రభుత్వం, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అఖిలపక్ష నాయకులు బంద్‌కు పిలుపునిచ్చారు. అఖిలపక్షం...