మాదారం క్రైస్తవ స్మృతి వనాన్ని సందర్శించిన వేలాది మంది క్రైస్తవులు

మాదారం క్రైస్తవ స్మృతి వనాన్ని సందర్శించిన వేలాది మంది క్రైస్తవులు (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి నవంబర్ 3: ఆల్ సోల్స్ డే సందర్భంగా మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ మండలం మాదారంలో ప్రభుత్వ క్రైస్తవ స్మృతి వనాన్ని వేలాది మంది క్రైస్తవులు సందర్శించారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సందర్శకుల రాకపోకలు కొనసాగాయి. తమ ఆత్మీయుల సమాధుల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి పుష్పాలతో నివాళులర్పించారు. స్మృతి వనంలో చేపట్టిన రహదారులు, తాగునీరు, విద్యుత్ దీపాలు, పారిశుద్ధ్య పనులపై సందర్శకులు హర్షం వ్యక్తం చేశారు. ఘట్‌కేసర్ మండల పాస్టర్స్ లీడర్స్ అసోసియేషన్ (జి.ఎం.పి.ఎల్.ఏ) మేడిపల్లి, పీర్జాదిగూడ పాస్టర్ల కమిటీలు, పాస్టర్లు,...