మంత్రిపై అసత్య ఆరోపణలు... ఖండించిన చిట్టిబాబు

మంత్రిపై అసత్య ఆరోపణలు... ఖండించిన చిట్టిబాబుతెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 3, నవంబర్దేశ రాజధాని ఢిల్లీలోని ప్రముఖ శాంగ్రిలా హోటల్‌లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ , జుక్కల్ నియోజకవర్గ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు మధ్య వాగ్వాదం జరిగిందంటూ మీడియాలో వస్తున్న కథనాలను అందోల్-జోగిపేట మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు) తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆయన స్పందిస్తూ మంత్రి దామోదర రాజనర్సింహపై వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ.. "మా నాయకుడి పైన లేనిపోని వార్తలు ఎవ్వరూ నమ్మరు. ఏదైనా అభివృద్ధి పైన గానీ, సంక్షేమ పథకాల...