అనారోగ్యంతో భర్త ఇంటి ముందు బాధితురాలి బైఠాయింపు

 వేధింపులు తాళలేక న్యాయం కోసం కన్నీటి పోరాటం రెండో పెళ్లి చేసుకుంటానంటున్న ఎన్నారై భర్త పోలీసులు న్యాయం చేయాలని మహిళా సంఘాల డిమాండ్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 04 : అత్తింటి వేధింపులు తాళలేక, తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఓ వివాహిత న్యాయం చేయాలంటూ భర్త ఇంటి ముందే బైఠాయించిన ఘటన కోరుట్ల పట్టణంలో కలకలం రేపింది. కోరుట్ల పట్టణం బుక్కవాడలోని భర్త గట్ల రాజేశ్ ఇంటి ఎదుట బాధితురాలు రచన, ఆమె కుటుంబ సభ్యులు, మహిళా సంఘాల నేతలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జగిత్యాలకు చెందిన రచనకు, కోరుట్లకు చెందిన గట్ల రాజేశ్‌తో...