బిఆర్ఎస్ నాయకులు జువ్వాడి కృష్ణారావును విమర్శిస్తే సహించేది లేదు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 04 : కోరుట్ల బిఆర్ఎస్ నాయకులు జువ్వాడి కృష్ణారావును విమర్శిస్తే సహించేది లేదని, ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ హెచ్చరించారు. ఈ సందర్భంగా బుధవారం కోరుట్ల పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... సిద్దిపేటకు చెందిన కేసీఆర్, కేటీఆర్ లు గజ్వేల్, రాజన్న సిరిసిల్ల ఎమ్మెల్యేలుగా, ఉమ్మడి కరీంనగర్ కు చెందిన హరీష్ రావు సిద్దిపేట ఎమ్మెల్యేగా జిల్లాల్లోని వివిధ నియోజకవర్గాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తూ, తెలంగాణ మొత్తం తమ జాగీర్ అనుకుంటున్నారని, వారు తమ సొంత నియోజకవర్గాల్లో కాకుండా పక్క నియోజకవర్గాల్లో ఎందుకు...