తిమ్మాపూర్లో విజయవంతంగా ఇంటి పన్ను వసూళ్లు
తిమ్మాపూర్లో విజయవంతంగా ఇంటి పన్ను వసూళ్లు సర్పంచ్ పుప్పాల నరేష్ తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 4: నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్గ్రామ అభివృద్ధిని కాంక్షిస్తూ, ప్రగతి పథంలో గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో నేడు తిమ్మాపూర్లో ప్రత్యేక ఇంటి పన్ను వసూళ్ల కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పుప్పాల నరేష్ అధ్యక్షత వహించగా, పంచాయతీ కార్యదర్శి బాస నరేందర్ మరియుగ్రామపంచాయతీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ పుప్పాల నరేష్ మాట్లాడుతూ.మెరుగైన సమాజ నిర్మాణం, ప్రజల సంక్షేమం మరియు మహాత్మా గాంధీ కలలు కన్న 'గ్రామ స్వరాజ్యం' సాధనే ధ్యేయంగా తమ పాలన సాగుతోందని స్పష్టం...