మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు కేటీఆర్ భరోసా.. స్వదేశానికి రప్పించేందుకు చొరవ

మస్కట్‌లో చిక్కుకున్న తెలంగాణ మహిళకు కేటీఆర్ భరోసా.. స్వదేశానికి రప్పించేందుకు చొరవ బతుకుదెరువు కోసం మస్కట్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన కొడంగల్‌కు చెందిన తుప్పుడు లక్ష్మిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవ తీసుకున్నారు.లక్ష్మి కుమారుడు రాజు తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ను కలిసి తన తల్లి పరిస్థితిని వివరించారు. స్పందించిన కేటీఆర్.. మస్కట్‌లోని బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడి లక్ష్మిని స్వదేశానికి తీసుకొచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.కేటీఆర్ చొరవతో స్వదేశానికి తిరిగి వచ్చిన లక్ష్మి, తన కుమారుడు రాజుతో కలిసి కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని కలిశారు. తల్లిని క్షేమంగా ఇంటికి చేర్చడంలో సహకరించినందుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.