రైతుల బోర్ల నుంచి పరిశ్రమలకు నీటి దందా! సర్పంచ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నీటి

సర్పంచ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ నీటి వ్యాపారం? వ్యవసాయ బోర్ల నుంచి ట్యాంకర్ల ద్వారా పరిశ్రమలకు సరఫరా వ్యవసాయ విద్యుత్ వినియోగంపైనా ఆరోపణలు.. సమగ్ర విచారణకు గ్రామస్తుల డిమాండ్ తెలంగాణ కెరటం  సంగారెడ్డి, నవంబర్ 5: ఓవైపు నీటి కొరతతో రైతులు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు గుండ్లమాచనూర్‌లో వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తోడి పరిశ్రమలకు తరలిస్తున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. గ్రామ సర్పంచ్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఈ నీటి వ్యాపారానికి సహకరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై జిల్లా అధికారులు తక్షణమే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. హత్నూర మండల పరిధిలోని గుండ్లమాచనూర్ గ్రామ శివారులో రైతుల వ్యవసాయ బోర్ల నుంచి నిత్యం నీటిని తోడి ట్యాంకర్ల...