పొగమంచు నేపథ్యంలో ప్రత్యేక వాహన తనిఖీలు
ముఖ్యమైన పాయింట్స్:220కి పైగా వాహనాల తనిఖీ.. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు రూ.1.20 లక్షల జరిమానాలు. కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు. చలికాలం నేపథ్యంలో ఉదయం వేళల్లో పొగమంచు అధికంగా ఉండటంతో రహదారి ప్రమాదాల నివారణకు, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.మంచిర్యాల, శ్రీరాంపూర్,సీసీ నస్పూర్,కేతనపల్లి, మంచిర్యాల బైపాస్ రోడ్డు,గద్దెరగడి తదితర ప్రాంతాల్లో ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహిస్తూ వాహనాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా రాంగ్ పార్కింగ్ చేసిన లారీలు,ఇతర భారీ వాహనాలతో పాటు మొత్తం 220కి పైగా వాహనాలను తనిఖీ చేశారు.ట్రాఫిక్ నిబంధనలు...