బాణసంచా బాధిత చిన్నారులకు ‘వాసన్’ అభయం.

బాణసంచా బాధిత చిన్నారులకు ‘వాసన్’ అభయం. 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నేత్ర వైద్యం.. అవసరమైతే శస్త్రచికిత్సలు సైతం ఉచితం.  నవంబర్ 5 ( తెలంగాణ కెరటం ): దీపావళి వేళ బాణసంచా కాల్చుతూ ప్రమాదవశాత్తూ కంటి గాయాల బారినపడే చిన్నారులకు అండగా నిలిచేందుకు ప్రముఖ నేత్ర వైద్య సంస్థ వాసన్ ఐ కేర్ మానవతా దృక్పథంతో ముందుకొచ్చింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా ‘సేఫ్ ఐస్.. సేఫ్ దీపావళి’ కార్యక్రమాన్ని చేపట్టి, 15 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత నేత్ర వైద్య సేవలు అందించనున్నట్లు ప్రకటించింది.ఏఎస్ రావు నగర్‌లోని వాసన్ ఐ కేర్ ఆసుపత్రిలో గురువారం నిర్వహించిన సమావేశంలో డాక్టర్ సుధీర్ చీమకుర్తి, డాక్టర్ సౌమ్య...