బాల్కొండ జడ్పీహెచ్ఎస్లో విజయవంతంగా ముగిసిన పేరెంట్ టీచర్ సమావేశం
బాల్కొండ జడ్పీహెచ్ఎస్లో విజయవంతంగా ముగిసిన పేరెంట్ టీచర్ సమావేశం తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 5: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పేరెంట్–టీచర్ సమావేశం విజయవంతంగా ముగిసింది. విద్యార్థుల విద్యాభివృద్ధి, ఉత్తమ విద్యా ప్రమాణాల సాధనతో పాటు పాఠశాల అభ్యున్నతిలో తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు రాజేశ్వర్ తెలిపారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థుల విద్యా ప్రగతి, చదువులో వారి సామర్థ్యం, క్రమశిక్షణ, హాజరు శాతం, పాఠ్యాంశాల వారీగా సాధించిన ప్రతిభ తదితర అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం విద్యార్థుల హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను తల్లిదండ్రులకు అందజేశారు.తల్లిదండ్రుల...