రైతు సంక్షేమమే పీఏసీఎస్‌ల ప్రధాన లక్ష్యం

రైతు సంక్షేమమే పీఏసీఎస్‌ల ప్రధాన లక్ష్యం నూతన చైర్మన్లకు ఆర్డర్ కాపీలు అందజేసిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రఘుపతి పేట గ్రామానికి చెందిన యువరైతు శ్రీపురం హరీశ్వర్ రెడ్డి  ఎరువులు, విత్తనాలు, పంట రుణాలు సకాలంలో అందించాలి తెలంగాణ కెరటము కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి నవంబర్ 05 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) ద్వారా రైతులకు మెరుగైన సేవలు అందించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పీఏసీఎస్‌లకు నూతనంగా నియమితులైన చైర్మన్లు ఎమ్మెల్యేను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ప్రభుత్వ నియామక ఉత్తర్వుల కాపీలను ఎమ్మెల్యే అందజేశారు.కల్వకుర్తి మండల పీఏసీఎస్‌ చైర్మన్‌గా రఘుపతిపేట గ్రామానికి చెందిన శ్రీపురం...