దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స
దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 05,తెలంగాణ కెరటం :సిద్దిపేట జిల్లా దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన వైద్య విజయం. ఒకే శస్త్రచికిత్సలో తల్లికి ప్రసవం, గర్భాశయ ఫైబ్రాయిడ్ తొలగింపు.సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం రుద్రారం గ్రామానికి చెందిన 34 సంవత్సరాల స్వప్న అనే గర్భిణి ప్రతి నెల దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకుంటూ వచ్చారు. ఆమెకు నిర్వహించిన స్కానింగ్‌లో గర్భంతో పాటు గర్భాశయంలోని ముందు భాగంలో 2 కిలోల 200 గ్రాముల పరిమాణంలో రక్తప్రసరణ కలిగిన ఫైబ్రాయిడ్ గడ్డ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పుట్టిన బిడ్డ బరువు 3 కిలోలు ఉన్నట్లు వైద్యులు తెలిపారు.ఈ క్లిష్టమైన కేసును...