భీంగల్ నూతన ఎస్ ఐ ను సన్మానించిన ఎన్ ఎస్ యు ఐ నాయకులు
భీంగల్ నూతన ఎస్ ఐ ను సన్మానించిన ఎన్ ఎస్ యు ఐ నాయకులు తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 5: నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణ పోలీస్ స్టేషన్ నూతన ఎస్.ఐగా బాధ్యతలు చేపట్టిన చిరంజీవిని ఎన్ ఎస్ యు ఐ. జిల్లా ఉపాధ్యక్షులుసయ్యద్ రెహమాన్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ.చిరంజీవి మాట్లాడుతూ యువతగా విద్యార్థి సంఘ నాయకులుగా సమాజంలోని మీ తోటి యువతను డ్రగ్స్, గంజాయి, తో పాటు ఇతరత్రా మత్తు పదార్థాలకు దూరంగా ఉండే విధంగా చైతన్య పరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఫయాజ్ ,ఆసిమ్, షాజీ,, నరేందర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.