ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: నందం గణేష్ బాబు

(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి నవంబర్ 5: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన బడులు.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ డివిజన్ కొండాపూర్ లోని ప్రాథమిక పాఠశాలకు రంగులు వేయించేందుకు సహకరించిన ఆయనను గురువారం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించి రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించారు.ఈ సందర్భంగా గణేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు...