బియ్యం దుకాణాలు, రైస్ మిల్లులో అధికారుల సంయుక్త దాడులు
రెండు దుకాణాల్లో ధరల ట్యాంపరింగ్.. కేసులు నమోదు సివిల్ సప్లై, తూనికలు, కొలతల అధికారుల సంయుక్త తనిఖీలు తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల పరిధిలోని బియ్యం హోల్సేల్, రిటైల్ దుకాణాలు, ఒక రైస్ మిల్లును శుక్రవారం జగిత్యాల జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తూనికలు, కొలతల అధికారులతో కలిసి సంయుక్తంగా విస్తృత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా చూడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో వ్యాపార సంస్థలో బియ్యం బస్తాలకు ఉన్న ధరలు కాకుండా ఎమ్మార్పీ లేబుల్ మార్చి,...