అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి
చౌదరిగూడలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి /నవంబర్ 6: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచనలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి శ్యామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా ఘట్కేసర్ మండలంలోని పోచారం డివిజన్ చౌదరిగూడ గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ...