ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ లతిక నరేష్
ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన సర్పంచ్ లతిక నరేష్ తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్ల మండలం మోహన్ రావు పేట గ్రామంలో శుక్రవారం ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను గ్రామ సర్పంచ్ సరికెళ్ళ లతిక నరేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి సరైన మద్దతు ధర లభించేలా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంబంధిత అధికారులు, ఐకేపీ సిబ్బంది సమన్వయంతో...