సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
సీఎం పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు రూట్ మ్యాప్, పార్కింగ్ స్థలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిధి నవంబర్ 6 తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతోంది. ముఖ్యమంత్రి పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఐపీఎస్ శుక్రవారం కోస్గి పట్టణంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.కోస్గిలోని సి.వి. రామన్ సైన్స్ మ్యూజియం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్న నేపథ్యంలో ఆయన రాకపోకలకు సంబంధించిన రూట్ మ్యాప్, కాన్వాయ్ వెళ్లే మార్గాలు,...