కల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
కల్లూరు గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కల్లూరు గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాంగ్రెస్ రాష్ట్ర సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ చిట్నేని లత రమేశ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ.. రైతులు పండించిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా విక్రయించుకొని, మద్దతు ధర పొందాలని సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కొనుగోలు కేంద్రం ద్వారా గ్రామంలోని...