దళితుల భూముల జోలికొస్తే ఊరుకోం
దళితుల భూముల జోలికొస్తే ఊరుకోం 40 కుటుంబాల జీవనాధారాన్ని కాపాడాలి. ఖాజీపూర్ రైతుల డిమాండ్తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 6 మద్దూరు ఖాజీపూర్: తమకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్ భూములను ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించవద్దని ఖాజీపూర్ దళిత రైతులు అధికారులను కోరారు. ఈ మేరకు, తహసిల్దార్ మహేష్ గౌడ్ కు,వినతిపత్రం సమర్పించారు. 60–70 ఏళ్ల క్రితం తమ పెద్దలకు కేటాయించిన 6 ఎకరాల 20 గుంటల భూమితో పాటు, మరో 2 ఎకరాల్లో నీలగిరి చెట్ల పెంపకం ద్వారా 40 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ఈ భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన...