దుబ్బాకలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు
దుబ్బాకలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06,తెలంగాణ కెరటం :విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 పోటీలకు దుబ్బాక మండలంలో నిర్వహించనున్నారు. శుక్రవారం దుబ్బాకలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్లను ఎంఈఓ ప్రభుదాస్, జడ్పీజిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు భూపాల్ ఆవిష్కరించారు.సైన్స్ పోటీలను పాఠశాల స్థాయిలో ఈ నెల 12 నిర్వహించే పాఠశాల స్థాయిలో విజేతలైన విద్యార్థులను మండల స్థాయి పోటీలను ఈ నెల 21, ఉదయం 10 గంటలకు TSMS లచ్చపేట...