బాణసంచా దుకాణాల్లో ఘట్కేసర్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు
బాణసంచా దుకాణాల్లో ఘట్కేసర్ పోలీసుల ఆకస్మిక తనిఖీలు (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి/ నవంబర్ 6: దీపావళి పండుగను పురస్కరించుకుని ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శాశ్వత, తాత్కాలిక బాణసంచా దుకాణాలను ఎస్హెచ్ఓ తన బృందంతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణాల్లో భద్రతా ఏర్పాట్లు, బాణసంచా నిల్వలు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. దుకాణదారులు పోలీసు, అగ్నిమాపక శాఖల అనుమతులు తప్పనిసరిగా పొందాలని, ప్రతి దుకాణం వద్ద అగ్నిమాపక యంత్రాలు, నీరు, ఇసుక బకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. దుకాణాల మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండేలా చూడాలని, విద్యుత్ వైరింగ్ పటిష్టంగా ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. పరిసరాల్లో ధూమపానం, బహిరంగ మంటలు...