ఆత్మగౌరవ భవనానికి రూ.5 కోట్లు స్వాగతిస్తున్నాం.

 అదే విధంగా ముదిరాజులకు జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించాలి: పడిగే ప్రశాంత్ ముదిరాజ్ సిద్దిపేట: తెలంగాణ రాష్ట్రంలో గంగపుత్రుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి రూ.5 కోట్లు మంజూరు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, అదే విధంగా సుమారు 26 లక్షల జనాభా కలిగిన ముదిరాజ్ సామాజికవర్గానికి కూడా జనాభా ప్రాతిపదికన తగిన నిధులు కేటాయించాలని తెలంగాణ ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర యువత అధ్యక్షులు పడిగే ప్రశాంత్ ముదిరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి బీసీ కులానికి సమానమైన గౌరవం, అభివృద్ధి అవకాశాలు, ఆత్మగౌరవ భవనాలు, విద్యా, ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గంగపుత్రులకు నిధులు కేటాయించడాన్ని తాము...