దుబ్బాక నియోజికవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి. -వడ్ల కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి. -సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జి.భాస్కర్.
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 07, తెలంగాణ కెరటం:సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల, పట్టణ కమిటీల సమావేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గొడ్డుబర్ల భాస్కర్ మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.దుబ్బాక నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతంగా ఉంటుందనీ భూగర్భ జలాలు అడుగంటిపోయి రైతుల పంటలు దిగుబడి రాక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఎల్ నీనో ప్రభావంతో వర్షపాతం చాలా తక్కువగా కురిసినందున తెలంగాణ రాష్ట్రంలో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి దుబ్బాక నియోజకవర్గంలో అన్ని మండలాల్లో కూడా...