రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం
రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం *రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది*: *ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ* తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెళ్లి, ఇరుకోడ్, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో నేడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ,...