రూ.30 లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత

రూ.30 లక్షల విలువైన 60 కేజీల గంజాయి పట్టివేత అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు.. ఇద్దరి అరెస్టు (తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి / నవంబర్ 7: ఎస్‌ఓటీ ఎల్‌బీనగర్ జోన్, పోచారం ఐటీ కారిడార్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అంతర్రాష్ట్ర గంజాయి అక్రమ రవాణా ముఠా గుట్టురట్టయింది. అనోజిగూడ గ్రామ శివారులోని మసాలా కంపెనీ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టి, కారులో తరలిస్తున్న 60 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.30 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కేసులో మహమ్మద్ అమెర్ (28), మహమ్మద్ ఇమ్రాన్ ఉద్దీన్ (35)లను అరెస్టు చేశారు....