చీకట్లను పారద్రోలి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి
చీకట్లను పారద్రోలి ప్రతి ఇంటా ఆనందాల వెలుగులు నిండాలి సంగారెడ్డి జిల్లా ,నియోజవర్గ ప్రజలకు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దీపావళి శుభాకాంక్షలు*!తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 7, నవంబర్సంగారెడ్డి జిల్లా , నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ సందర్భంగా సంగారెడ్డి శాసనసభ్యులు చింత ప్రభాకర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగను ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందోత్సాహాల మధ్య, సురక్షితంగా జరుపుకోవాలని కోరారు. ప్రజల ఇళ్లలో ఆనందాల వెలుగులు నిండాలని, చింత ప్రభాకర్ ఆకాంక్షించారు.