ముగ్గురు చిన్నారులతో తల్లి అదృశ్యం!
ముగ్గురు చిన్నారులతో తల్లి అదృశ్యం! *కొండాపూర్లో కలకలం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు* (తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి /నవంబర్ 7: ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొండాపూర్ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ముగ్గురు చిన్నారులతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. బాధితురాలి తల్లి బొంత సారిత (46) ఫిర్యాదు మేరకు ఘట్కేసర్ పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.వివరాల్లోకి వెళితే.. మమత (26)కు సుమారు ఎనిమిదేళ్ల క్రితం కామారెడ్డికి చెందిన కుంచపు పోచయ్యతో వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. అయితే ఐదు నెలల క్రితం భర్తతో కుటుంబ విభేదాలు తలెత్తడంతో మమత తన ముగ్గురు...