గంట వ్యవధిలోనే 10 తులాల బంగారం రికవరీ

గంట వ్యవధిలోనే 10 తులాల బంగారం రికవరీ బాధితుడికి బంగారం అప్పగించిన బుగ్గారం ఎస్ఐ శ్రీకాంత్ బుగ్గారం: పోలీసుల చాకచక్యం, సమయస్ఫూర్తితో పోగొట్టుకున్న 10 తులాల బంగారం గంట వ్యవధిలోనే తిరిగి బాధితుడికి చేరింది. బుగ్గారం ఎస్ఐ ఎస్. శ్రీకాంత్ చూపిన చొరవపై వెలుగొండ గ్రామ యువకులు అభినందనలు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి మండలానికి చెందిన మూట శంకర్ తన మరదలి వివాహం నిమిత్తం ముంబై నుంచి 10 తులాల బంగారం కొనుగోలు చేసి, బ్యాగులో పెట్టుకొని ధర్మపురికి బయలుదేరాడు. జగిత్యాలలో ధర్మపురి వెళ్లే బస్సు ఎక్కి ప్రయాణిస్తుండగా, వెలుగొండ స్టేజి దాటిన తర్వాత తన బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై డయల్ 112కు...