పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..! -దుబ్బాకకు 5,500 ఇందిరమ్మ ఇళ్లు అందించిన ఘనత సీఎం రేవంత్ రెడ్డిదే -చెరుకు శ్రీనివాస్ రెడ్డి -దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి

దుబ్బాక ప్రతినిధి,నవంబర్ 08, తెలంగాణ కెరటం:దుబ్బాక నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను దుబ్బాక పట్టణంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించిన దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి.ఈ సందర్భంగా చెరుకు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ప్రతి పేదవాడి జీవితంలో సొంత ఇల్లు అనేది ఒక గొప్ప కల. ఆ కలను నిజం చేసే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోంది. దుబ్బాక నియోజకవర్గానికి ఇప్పటివరకు 5,500 ఇందిరమ్మ ఇళ్లను...