ఇందిరమ్మ ఇళ్లలో వెలుగులు నింపిన దీపావళి సంబరాలు. -లబ్ధిదారులతో కలిసి పండుగ వేడుకల్లో పాల్గొన్న పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్

దుబ్బాకప్రతినిధి,(అక్బర్‌పేట-భూంపల్లి) నవంబర్ 08, తెలంగాణ కెరటం:అక్బర్‌పేట-భూంపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మధ్య దీపావళి పండుగ సంబరాలు ఆనందోత్సాహాల మధ్య నిర్వహించారు.ఈ వేడుకల్లో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్, గ్రామపంచాయతీ పాలకవర్గం, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని లబ్ధిదారులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకున్నారు.ఇందిరమ్మ ఇళ్లతో పేద కుటుంబాల సొంతింటి కల సాకారమవుతున్న వేళ, వారి మధ్య దీపావళి పండుగను జరుపుకోవడం ప్రత్యేక ఆనందాన్ని కలిగించిందని దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్, సర్పంచ్ నీల ప్రభాకర్ పేర్కొన్నారు.ప్రతి ఇంటా సంతోషాలు, ప్రతి కుటుంబంలో వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ లబ్ధిదారులకు...