ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు -ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి సంబరాల్లో పాల్గొన్న -9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, వార్డు ఆఫీసర్ కరుణాకర్
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 08, తెలంగాణ కెరటం:దీపావళి పండుగను పురస్కరించుకుని దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు ధర్మాజీపేటలో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మున్సిపాలిటీ 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్, వార్డు ఆఫీసర్ తునికి కరుణాకర్ పాల్గొని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కుటుంబాలతో కలిసి దీపావళి పండుగ సంబరాలు నిర్వహించారు.ఈ సందర్భంగా 9వ వార్డు కౌన్సిలర్ వనం రమేష్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేద, మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేరడం ఎంతో సంతోషకరమని అన్నారు. సొంత ఇంట్లో దీపావళి పండుగను జరుపుకోవడం లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపిందని పేర్కొన్నారు. ప్రజల...